NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్లమెంట్ ఎదుట రైతు నిర‌స‌న‌లు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: జులై 22 నుంచి కొత్త వ్యవ‌సాయ చ‌ట్టల‌కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఎదుట నిర‌స‌న‌లు తెలియ‌జేయ‌నున్నట్టు రైతు ఉద్యమ నేత రాకేష్ తికాయ‌త్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో చ‌ర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే జ‌న‌వ‌రి 26న జ‌రిగిన ఎర్రకోట ఘ‌ట‌న‌పై నిష్పక్షపాత విచార‌ణ కోరుకుంటున్నామ‌ని తెలిపారు. ఇక్కడ నిష్పక్షపాత ద‌ర్యాప్తు చేసే సంస్థ ఉందా? లేదా ఐరాస‌కు వెళ్లాలా? అంటూ తికాయత్ మీడియాతో మాట్లాడారు. అయితే.. తాము ఐరాస వ‌ద్దకు వెళ్తామ‌ని ఎప్పుడూ అన‌లేద‌ని, కేవ‌లం ఎర్రకోట ఘ‌ట‌న పై అడిగిన ప్రశ్నకు మాత్రమే స్పందించామ‌ని తెలిపారు. గ‌త కొద్ది నెల‌లుగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవ‌సాయ‌చ‌ట్టాల‌కు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నారు.

About Author