” ఫార్మర్ రిజిస్ట్రేషన్” కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళగుంద మండలంలో అన్ని ఆర్ ఎస్ కే సిబ్బందితో మండల వ్యవసాయ అధికారి శ్రీ, ఆనంద్ లోకదళ్ వారు రియు మీటింగ్ పెట్టడం జరిగింది ఈ సమావేశంలో ప్రతి రైతుకు ఒక ప్రత్యేక రైతు గుర్తింపు ఐడి సంఖ్యను భారత ప్రభుత్వం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ సమన్యాయంతో,” ఫార్మర్ రిజిస్ట్రేషన్” అనే ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభించింది అని కావున రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1) పట్టుదారు పాస్ పుస్తకం జిరాక్స్ లేదా 1-B
2) ఆధార్ జిరాక్స్
3) ఆధార్ నంబర్ కు లింక్ అయిన ఫోన్ తీసుకో రావాలి
అలాగే మార్ల మడికి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కజొన్న పొలంను సందర్శించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది కత్తెర పురుగు నివారణ కోసం ఇమా మెక్సిఫన్ బెంజిఎట్ 0.4 గ్రామ్స్లో గాని స్పైనోసాడ్ 0.3ml నీటికి గాని సూడలతో తడిచే విధంగా పీచకారి చేసుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక్ దళ్ తో పాటు మధుమోహన్, ఏ ఈ ఓ విరుపాక్షి, ఎంపీఈఓ నరసింహ, మహేష్, మరియు రైతులు పాల్గొన్నారు.