ఏపీలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి !
1 min readపల్లెవెలుగువెబ్ : వైసీపీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటి వరకూ జరిగిన 8067 ఆత్మహత్యల్లో 5677 ఆత్మహత్యలు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాల వారివే అని అన్నారు. గత ఏడాదితో పోల్చితే 14.5 శాతం రైతు ఆత్మహత్యలు రాష్ట్రంలో పెరిగినదానిపై సీఎం ఎందుకు సమాధానం చెప్పరని ప్రశ్నించారు. రైతుల నుంచి అత్యంత తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి అధిక ధరలకు వైసీపీ నేతలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.