PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతు సంక్షేమమే.. ప్రభుత్వ ధ్యేయం

1 min read

– వీసీలో సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​ ,కడప: రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తున్న తమ ప్రభుత్వంలో రైతులు తలెత్తుకుని సగర్వంగా జీవిస్తున్నారని, ఇది ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి. మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుండి 2020 ఖరీఫ్ సీజనుకు సంబంధించి “డా.వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా” పథకం లబ్ది మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో బటన్​ నొక్కి జమ చేశారు. కార్యక్రమంలో కడప కలెక్టరేట్ నుండి కలెక్టర్ సి.హరికిరణ్ , ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామిరెడ్డి, జేసీ (రెవెన్యూ, ఆర్బికే) ఎం.గౌతమి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్​ సి. హరికిరణ్​ మాట్లాడుతూ జిల్లాలో 2020 ఖరీఫ్ సాగుకు సంబంధించి “డా.వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా” పథకం క్రింద మొత్తం 45,703 మంది అర్హులయిన రైతులకు రూ.87.04 కోట్ల మొత్తం విడుదలయిందన్నారు. ఇందులో వరి పంటకు సంబంధించి 26,840 మంది రైతులకు గాను రూ.56.641 కోట్లు, చీనీ పంటలకు సంబంధించి 7,366 మంది రైతులకు గాను రూ.19.915 కోట్లు, వేరుశెనగ పంటకు సంబంధించి 8944 మంది రైతులకు గాను రూ. 5.067 కోట్లు, టమోటా పంటకు సంబంధించి 1544 మంది రైతులకు రూ.1.712 కోట్లు, దానిమ్మ పంటకు గాను 338 మంది రైతులకు రూ.3.181 కోట్లు, పొద్దుతిరుగుడు పంటకు గాను 671 మంది రైతులకు రూ.0.526 కోట్లు మంజూరైందని ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వివరించారు.
మెగా చెక్కు విడుదల : సీఎం విసి ముగిసిన అనంతరం 2020 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి.. 45,703 మంది జిల్లా రైతులకు మంజూరయిన రూ.87.041 కోట్ల “వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా” పథకం లబ్ది మొత్తం మెగా చెక్కును.. జిల్లా కలెక్టర్ హరికిరణ్ తోపాటు ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామిరెడ్డిల చేతుల మీదుగా రైతులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి రాధాదేవి, ఉద్యనవనశాఖ డీడీ వజ్రశ్రీ, అనుబంధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author