NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

1 min read

– సర్పంచ్​ బంగారు షరీఫ్​
పల్లెవెలుగు వెబ్​, చాగలమర్రి: రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పని చేస్తోందని పెద్దవంగలి సర్పంచ్‌ బంగారు షరీఫ్​ అన్నారు. శుక్రవారం పెద్దవంగలి రైతుభరోసా కేంద్రంలో సర్పంచ్‌ అధ్యక్షతన కౌలు కార్డుపై సంక్షేమ పథకాలు పొందే విధానంపై కౌలు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ అధికారిణి నహిదాబాను మాట్లాడుతూ పంటలు సాగుచేస్తున్న కౌలు రైతులు పంట సాగు దారు హక్కు పత్రం ( కౌలు కార్డు ) పొందేందుకు భూ యజమాని తో కలిసి విఆర్వో లను సంప్రదించి కౌలు కార్డు పొందాలన్నారు. కార్డు పొందిన కౌలు రైతులకు ప్రభుత్వం అందించే వ్యవసాయ శాఖ సంక్షేమ పథకాలైన రైతు భరోసా, పంట నష్టం, పంట బీమా, బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంటుందన్నారు . కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ పుల్లయ్య, ఏఈఓ నరసింహ, విఆర్‌ఓ ఇమామ్‌భాష, వ్యవసాయ సహాయకుడు జయకృష్ణ, రైతులు పాల్గొన్నారు .

About Author