PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికారుల కోసం రైతులు పడిగాపులు

1 min read

-జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులను హెచ్చరించినా మార్పు వచ్చేనా..?

పల్లెవెలుగు,మిడుతూరు: ప్రజల కన్నా అధికారులే ముందర ఉండాల్సిన వారు ఆలస్యంగా విధులకు వస్తూ ఉండడం పట్ల ప్రజలు మరియు రైతులు విసుగు చెందుతున్నారు.వైకాపా ప్రభుత్వం 2019 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మరియు రైతులు తమ తమ గ్రామాల్లోనే పనులు పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో  ప్రభుత్వం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లోని కార్యాలయాలను ఏర్పాటు చేసింది.కానీ కొందరు అధికారులు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వ ఆశయాలను నీరుగా గారుస్తున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రం బుధవారం ఉదయం 9 గంటల నుండి పీరు సాహెబ్ పేట గ్రామ పొలిమేరలో చింతల పల్లె రైతుల పొలాలు ఉన్నాయి.పంట నష్టపరిహారం కొరకు పొలాలకు సంబంధించిన పత్రాలు ఇవ్వడానికి వస్తే ఇక్కడ కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో రైతులు నిరీక్షించాల్సి వచ్చింది.11:30 కు అధికారి కార్యాలని కి వచ్చారని రైతులు అన్నారు.ఈనెల 10వ తేదీన మిడుతూరుకు వచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ మీరు సరిగ్గా ప్రజలకు పనులు చేయడం లేదంటూ అన్ని శాఖల మండల అధికారులు, గ్రామస్థాయి అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..వివిధ శాఖల అధికారులు కార్యాలయాలను మండల అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.జిల్లా కలెక్టర్ చెప్పిన మాటకు అధికారులు కట్టుబడి ప్రజా సమస్యలకు దగ్గరగా అవుతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

About Author