కౌలు కార్డుల కోసం రైతులు దరఖాస్తు చేసుకోండి..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలానికి.2023వ సం 750 టార్గెట్ నిర్వహించినట్టు మంగళవారం నాడు మండల వ్యవసాయ అధికారి హింసుందర్ రెడ్డి తెలిపారు బిలకల గూడూరు కరిమద్దెల గ్రామ సచివాలయాల్లో కౌలు కార్డు పై అవగాహన కల్పించారు. గడివేముల మండలంలోని 14 రైతు భరోసా కేంద్రాల వద్ద రైతు సోదరులు రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ వారిని సంప్రదించి సంయుక్తంగా వారికి ఆధార్ కార్డు ,పాస్ పుస్తకం జిరాక్స్, వన్ బి, కౌలు ఖరారు నామా పూర్తి చేసి అర్హత ఉన్నట్టయితే ఆ రైతులకు రెవెన్యూ శాఖ వారు పరిశీలించి విఆర్ఓ లాగిన్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీనికి విధిగా ఓనరు మరియు సాగుదారుడు విఆర్ఓ మరియు విఏఏ ఆధ్వర్యంలో అగ్రిమెంట్ చేసుకోవాలి .అదే విధంగా ఫోటోలు తీసి అప్లికేషన్ ఫామ్ కి జతపరచాలన్నారు. వీఆర్వో లాగిన్ లో అప్లోడ్ చేసినటువంటి అర్హుల జాబితా నుంచి సిసిఆర్సి కార్డు తీయటము దానిని వ్యవసాయ శాఖ వారికి ఇవ్వడము వారు అర్హతను పట్టి వారి లాగిన్సులో అప్లోడ్ చేయడం జరుగుతుందని అన్నారు.కాబట్టి రైతు సోదరులందరూ ఈ పథకాన్ని వినియోగించుకోవలసిందిగా వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి తెలిపారు.