ఈ క్రాప్ బుకింగ్ పై రైతులకు అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలంలోని దుర్వేసి, గడిగరేవుల మరియు పెసర వాయి గ్రామాలలో మంగళవారం నాడు జిల్లా వ్యవసాయ అధికారి ప్రతి ఒక్క ఆర్ బి కే మరియు గ్రామ సచివాలయం నందు మండలంలోని పంట నమోదు చేసుకున్నటువంటి రైతుల వివరములు, పంట , రకము, నీటి వనరుల లభ్యత , ఖాతా నెంబరు, సర్వే నెంబరు , విస్తీర్ణం, ఈ కేవైసీ వేసినటువంటి రైతు సోదరులు ఆర్బికే మరియు సచివాలయం నందు రైతుల జాబితాను ప్రదర్శించారు. ఈనెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రైతు సోదరులు లిస్టు చూసుకొని ఏదైనా తప్పులు ఉన్నట్లయితే సంబంధిత ఆర్బికే సిబ్బందికి అర్జీ రూపంలో ఇచ్చి తప్పులను నివృత్తి చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈనెల 20వ తేదీ లోపు ఎంఏఓ మరియు తహసిల్దార్ సంతకాలతో జాబితా తయారవుతుందన్నారు. ఈనెల 23 వ తారీకు సరిదిద్దునటువంటి ఆఖరి జాబితాను మరొకసారి ఆర్.బి.కెల యందు ప్రదర్శించడం జరుగుతుందన్నారు.