ప్రభుత్వంపై విరుచుకుపడ్డ దేవర్ల మురళి -రైతులు కన్నీళ్లు పెడుతున్నారు
1 min read– ఈ ప్రభుత్వం మూడు నెలలే.. -పాత్రికేయుల సమావేశంలో దేవర్ల మురళి సంచలన వ్యాఖ్యలు..
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: చరిత్రను సృష్టించాలన్నా చరిత్రను తిరగరాయాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి అబ్జర్వర్ దేవర్ల మురళి అన్నారు.గురువారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా దేవర్ల మురళి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి సూపర్ సిక్స్ ఆరు పథకాలను ప్రవేశపెట్టిందని టిడిపి మాట ఇస్తే మాట తప్పకుండా నెరవేరుస్తుందని ఒక్క సారి అవకాశం అడిగితే ఓట్లు వేశామని మేము నమ్మాం నమ్మి ఓట్లు వేస్తే మమ్మల్ని నట్టేట ముంచేసి మా ప్రాణాలతో ముఖ్యమంత్రి చెలగాటం ఆడుతున్నారని గ్రామాల్లో ప్రజలు స్వయంగా మాతోనే అంటూ ఉన్నారన్నారు.చెత్త బిల్లు,నిత్యవసర సరుకులు పెట్రోల్ డీజిల్ తదితర వస్తువుల ధరలను పెంచుతూ మమ్ములను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మద్యం రేట్లు కరెంటు షాకుల మాదిరి పెంచేశారని ముచ్చుమర్రి మరియు చుట్టు ప్రక్కల గ్రామాలకు నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు. రైతులు రాత్రి పగలు అనకా కష్టపడుతుంటే రైతులు రోడ్ల మీద కన్నీళ్లు పెడుతున్నారని రోజుకొక జీవోలు ఇస్తారు.ఈ ప్రభుత్వం ఉండేది మూడు నెలలు మాత్రమే పార్టీని కాలగర్భంలో కలిపినందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపేందుకు రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ఎదురుచూస్తూ ఉండాలని నియోజకవర్గ టిడిపి అబ్జర్వర్ దేవర్ల మురళి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.అనంతరం మిడుతూరు గ్రామంలో భవిష్యత్తు గ్యారంటీ అనే కరపత్రాలను పంచుతూ ప్రజలతో వారు మమేకం అయ్యారు.ఈ కార్యక్రమంలో చింతలపల్లి,దేవనూరు మాజీ సర్పంచులు వెంకటేశ్వర రెడ్డి, నాగేంద్ర,మండల యువ నాయకులు యరభం ప్రమోద్ రెడ్డి,బైరాపురం మొల్ల చాకర్ వలి,ఐటిడిపి మండల కన్వీనర్ ఇంతియాజ్,విష్ణువర్ధన్ రెడ్డి,గొల్ల గోపాల్ యాదవ్,శ్రీను,నారాయణ తదితరులు పాల్గొన్నారు.