PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశానికి వెన్నెముక రైతులు

1 min read

రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు  కే బాబురావు     

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   మన దేశానికి రైతులు వెన్నెముక లాంటి వారని రైతులు బాగుంటేనే పల్లెలు పట్టణాలు రాష్ట్రాలు దేశం బాగుంటుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు గారు తెలియజేశారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబురావు గారు మాట్లాడుతూ నూతన ప్రభుత్వానికి, మరియు నూతన కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని మనిషికి వెన్నెముక ఎంత అవసరమో దేశానికి రైతు వెన్నెముక లాంటి వారని ప్రభుత్వాలు గుర్తించాలని కోరారు. అదేవిధంగా దేశాభివృద్ధికి రైతుతో పాటు విద్య కూడా ముఖ్యమని భావించాలని విద్య, వైద్యం పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. తొలకరి చినుకులు పడి రైతులు నాట్లు వేసుకుంటున్నారని వారికి మీరు హామీ ఇచ్చిన 20వేల రూపాయలు ఇస్తే రైతులకు ఆసరాగా ఉంటుందని అలాగే విద్యార్థులకు తగిన వసతులు, సిబ్బంది తగినంత కల్పించాలని  విద్యార్థులకు సీట్ల విషయంలో కస్తూరిబా, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్ లలో సీట్లు పెంచాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని బాబురావు గారు తెలియజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు  మాట్లాడుతూ తొలకరి జల్లులు పడి రైతులు పొలాలలో పనులు చేసుకుంటున్నారని నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఎన్నికల ముందు రైతులకు నష్టపరిహారం కింద 20 వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారని రైతులకు ఇచ్చిన హామీ డబ్బులు 20వేల రూపాయలను రైతులు ఖాతాలలో వేసి రైతులను ఆదుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని కోరారు. అలాగే రాజకీయాలకు అతీతంగా  అందరికీ న్యాయం చేయవలసిన బాధ్యత పాలకులకు ఉందని కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని ఇతర సమస్యలు పక్కనపెట్టి ముందు రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతులకు ఇవ్వాల్సిన 20000 రూపాయలు వెంటనే రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి గౌరవాధ్యక్షులు ఉండవల్లి వెంకటన్న, డిసిసి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం మాదిగ, డిసిసి ప్రధాన కార్యదర్శి సయ్యద్ నవీద్, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఈ లాజరస్, జిల్లా సోషల్ మీడియా చైర్మెన్ అమనుల్లా, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు ఎన్సీ బజారన్న, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఖాద్రి పాషా, సిటీ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, డిసిసి కార్యదర్సులు బి సుబ్రహ్మణ్యం, వెల్దుర్తి శేషయ్య మొదలగు వారు పాల్గొన్నారు.

About Author