రైతులే దేశానికి వెన్నెముక
1 min read

డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వర యాదవ్
ప్యాపిలి న్యూస్ నేడు : పంట పండించే రైతన్నలే దేశానికి వెన్నెముకలని డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్యాపిలి పట్టణంలోని వ్యవసాయ సాధికార కార్యాలయం నందు రైతులకు పొలం అభివృద్ధి పరుచుకోవడానికి గాను 52 లక్షల 83వేలు లోను మంజూరైనట్లు సి ఈ ఓ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ చెక్కులను పంపిణీ చేయడానికి ముఖ్య అతిథులుగా డీసీఎంఎస్ చైర్మన్ వై .నాగేశ్వరరావు యాదవ్ హాజరై ఆయన చేతుల మీదుగా 10 లక్షల చెక్కును రైతు జి. వెంకటేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ మాట్లాడుతూ వ్యవసాయ సహకార కార్యాలయం రైతులకు సంబంధించినది, రైతులకు పొలం పై లోన్ మంజూరు చేస్తూ వాటిపై పొలం అభివృద్ధి చేసుకొని మంచి పంటలు దిగుబడి చేసుకొని రైతుల కుటుంబాలు సంతోషంగా ఉండాలని, దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆర్థికంగా మెరుగుపడాలి ఆయన కోరారు. ఈకార్యక్రమంలో తేదేపా నాయకులు మాజీ ఎంపిపి టి.శ్రీనివాసులు, మాజీ ఎంపిటిసి గోల్ల రామ్మోహన్ యాదవ్, డీసీఎంఎస్ మేనేజర్ శరణ్య, రంపురం సుంకరి నాగేశ్వరావు,పోతుదొడ్డి పుల్లారెడ్డి,కదిరప్ప, మహేష్, భాస్కర్ నాయుడు,కొదండరామయ్య, ఆర్సీ మద్దిలేటి, మరియు రైతులు పాల్గొన్నారు.

