జిల్లాలో రైతు సంఘాలు బలోపేతం కావాలి డ్వామా పిడి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నాబార్డ్ ద్వారా బ్యాంకుల నుండి రుణాలను సద్వినియోగం చేసుకొని, అలాగేమార్కెట్ సదుపాయాలను మెరుగు పరచుకొని జిల్లాలోని రైతు సంఘాలు బలోపేతం కావాలని డ్వామా పిడి పి రామచంద్రారెడ్డి రైతులకు సూచించారు. మంగళవారం స్థానిక డ్వామా కాన్ఫరెన్స్ హాలులో నాబార్డ్ వారి ఆధ్వర్యంలో బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నంద్యాల జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులు, రైతు ఉత్పత్తి దారుల సంఘాల బోర్డు సభ్యులు మరియు మహిళలు హాజరయ్యారు.నాబార్డ్ చేస్తున్న కార్యక్రమాల గురించి, బ్యాంకులు మరియు FPO ల అనుసంధానం గురించి నాబార్డ్ D D M M. సుబ్బా రెడ్డి ,DDM, తెలియ జేశారు FPO ల ఏర్పాటు, తీసుకోవలసిన జాగ్రత్తలు, బిజినెస్ కార్యక్రమాల గురించి మరియు బ్యాంకుల ద్వారా లోను సౌకర్యం ఎలా పోందాలో APMAS కో ఆర్డినేటర్ మహేష్ అలగప్ప రైతులకు వివరించారు.రైతు సంఘాలకు లోను సౌకర్యం కల్పించే స్కీముల గురించి SBI మరియు APGB రీజినల్ మేనేజర్లు లబ్ధిదారులకు అవగాహన కల్పించారు FPO లు బిజినెస్ చేసి వృద్ధి చెందాలని, ఆర్థిక స్థితి మెరుగు పరుచుకోవాలని LDM యం.రవీంద్ర కుమార్ రైతులకు సూచించారు. కావున అన్ని బ్యాంకులు సకాలంలో స్పందించి FPO లను ఆదుకోవాలనిఆయన కోరారు.ఈ కార్య్రక్రమంలో apcob AGM నహిద సుల్తానా, డీసీసీబీ డీజీఎం, ఉమామహేశ్వర రెడ్డి, SBI రీజినల్ మేనేజర్ టి. శ్రీనివాస్, APGB రీజినల్ మేనేజర్ పి. వి. రమణ, వివిధ బ్యాంకుల అధికారులు, ప్రభుత్వ శాఖల అధికారులు మరియు FPO సభ్యులు పాల్గొన్నారు.