వ్యవసాయ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
1 min readపల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామంలో నకిలీ విత్తనాల వల్ల వేసిన పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ మిడుతూరు మండల వ్యవసాయ కార్యాలయాన్ని రైతులతో కలిసి వారు ముట్టడించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వీపనగండ్ల గ్రామంలో దాదాపుగా 300 ఎకరాలు పత్తిని సాగు చేశారని నకిలీ విత్తనాల వల్ల ఆపంటలు పూర్తిగా నష్టం వాటిల్లిందన్నారు.అంతేకాకుండా ఉల్లి,మిరప, మొక్కజొన్నల పంటలు వేసిన రైతులు కూడా నష్టపోయారని అన్నారు.కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేక భూమిని కౌలుకు తీసుకొని వేలకొద్ది రూపాయలు ఖర్చు చేసి నష్టపోయారని అన్నారు.నకిలీ విత్తనాలను తయారు చేస్తున్న యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.పత్తి, మిరపకు 60వేలు మొక్కజొన్న,ఉల్లి వేసిన రైతులకు 40 వేల రూపాయలు తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు ఓబులేసు,మండల కార్యదర్శి రామకృష్ణ,బాలకృష్ణ, ఏసన్న,రమేష్,సుంకన్న,బేబీ,హరి,శివరాముడు తదితరులు పాల్గొన్నారు.