PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతులు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవిని అమ‌రావ‌తి రైతులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా మంద‌డంలో గ్రామ స‌చివాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యేని.. లింగాయ‌పాలెం స‌మీపంలో అమ‌రావ‌తి ద‌ళిత ఐకాస నేత‌లు అడ్డుకున్నారు. అసైన్డ్ భూముల రైతుల‌కు ప్రభుత్వం కౌలు డ‌బ్బులు, ఫించ‌న్ చెల్లించ‌డంలేదంటూ ఆమెకు విన‌తిప‌త్రం ఇచ్చేందుకు ప్రయ‌త్నించారు. ఎమ్మెల్యే వాహ‌నానికి అడ్డంగా ప‌డుకున్నారు. నిర‌స‌న‌కారుల‌ను పోలీసులు ప‌క్కకు నెట్టేశారు. స‌మ‌స్యలు చెప్పుకునేందుకు వెళ్తే ఎమ్మెల్యే పట్టించుకోలేద‌ని రైతులు వాపోయారు.

About Author