పొలాల రాస్తా కోసం రైతుల ఆందోళన
1 min readరాస్తా ఇవ్వకుంటే జాతీయ రహదారి పనులు అడ్డుకుంటాం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: వీపనగండ్ల గ్రామ సరిహద్దులోని పొలాలకు రాస్తా ఏర్పాటు చేయాలని నందికొట్కూరు పట్టణానికి చెందిన రైతులు జాతీయ రహదారి పనులను బుధవారం అడ్డుకున్నారు. పొలాలకు రాస్తా ఏర్పాటు చేయకపోతే దాదాపు 200 ఎకరాలు పంట పొలాలు బీడుగా మారే ప్రమాదం ఉందన్నారు. 340సి జాతీయ రహదారి పనులు ప్రారంభించడానికి ముందు గుత్తేదారు రాస్తా ఏర్పాటు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు కానీ రహదారి నిర్మాణం పనులు పూర్తి కావచ్చిన రాస్తా ఏర్పాటు చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దాదాపు 40 మంది రైతులు రహదారి నిర్మాణం పనులను అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. దీనితో కొద్దిసేపు పనులకు ఆటంకం ఏర్పడింది. సైట్ సూపర్ వైజర్ రైతులతో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని గుత్తేదారు కు తెలియజేసి రాస్తా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో రైతులు జనార్దన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పుల్లారెడ్డి, శంకరప్ప ,రామకృష్ణ గౌడు, చామండి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.