పండ్ల తోటల సాగుతో రైతులకు మంచి లాభాలు…
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పండ్ల తోటల సాగుతో రైతులు మంచి లాభాలు సాధించవచ్చని జిల్లా అంబుడ్స్ మెన్ డా.ఆర్. సురేంద్ర కుమార్ అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహమీ పధకం కింద నందికొట్కూరు మండలం లోని వడ్డెమాను, కొనేటమ్మపల్లె, బొల్లవరం గ్రామాలలో చేపట్టిన కొబ్బరి, చీనీ, నిమ్మ పండ్ల తోటలను మంగళవారం ఆయన పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి పండ్లతోటలు సాగుచేసిన రైతులతో మాట్లాడారు. పండ్లతోటల సాగు ద్వారా వందశాతం సబ్సిడీని పొంది మంచి లాభాలు సాధించవచ్చాన్నారు రైతులకు అంతర పంటలు , మొక్కల సంరక్షణ గురించి పలు సూచనలు సూచించారు .ఆయన వెంట ఏపీఓ అలివేలు మంగమ్మ, ఈసి షబానా, టీఏ ఉమేష్, ఆయా గ్రామాల ఫిల్డ్ అసిస్టెంట్ లు ఉన్నారు.