రైతులు అప్రమత్తంగా ఉండాలి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: తుపాను ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు సలహాలు తప్పనిసరిగా పాటించాలని సోమవారం మండల వ్యవసాయాధికారి షేక్షావాలి ఒక ప్రకటన లో పేర్కొన్నారు.వాతావరణం శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తలు, సత్వర చర్యల గురుంచి రైతాంగానికి తెలియజేశారు.వరిపంట లో గింజ గట్టిబడి కోతకు సిద్దముగా వున్న వరిలో సత్వరమే కంబైన్డ్ హర్వెస్టర్ ఉపయోగించి ,వచ్చిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతములో వర్షమునకు తడవకుండా ఆరబెట్టుకోవడం ,తగినన్ని టార్పలిన్ ,పాలిథిన్ పట్టాలను పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టుకోవడం ,తుఫాను వెలిసిన తరువాత ఆ ధాన్యమును ఆరబెట్టుకునే విధముగా వుండటం చేయవలసి వుంటుంది. వరి పంట కోసి పనలు చేనులో వుండే పరిస్థితులలో తక్షణమే పనలను కట్టలు కట్టి గూడు లేదా కుప్పలు పోసి పంటను వర్షం నుండి తడవకుండా కపడుకోవచ్చును.తడిసిన పనలలో మొలకలు రాకుండ 5 శాతం ఉప్పు ద్రావణం పిచికారీ పై ముందస్తుగా దిగువశ్రేణి క్షేత్ర సహాయకులు అవగాహన కల్పించడం చేయ వలసినదిగా తెలుపుట మైనది.అదే విధముగామెట్ట పంటలు అయినటువంటి ఖరీఫ్ పత్తి,మిరప పంటల చేనులలో వర్షపు నీరు నిలవ కుండా, వర్షపు నీరు వేగముగా,సులభముగా కొట్టుకు పోయే విధముగా చేల గట్లలో ఎక్కువ సంక్యలో వాలుకూ నిలువుగా గండ్లు చేయటం జరగాలి.పత్తి పంట 3 వ తీతకు కాయలు విచ్చుకుని పత్తి తీతకు సిద్ధమైన కాయలనుండి పత్తి ని తీయడం,మిరపలో తయారైన పచ్చి మిరప ,పండు మిరపను చేను నుండి కోసి ,అధికవర్షములనుండి కాయలు తడవకుండా ,బూజు పట్టకుండా కాపాడు కోవచ్చు.దిగువ శ్రేణి సిబ్బందికి వానలు తగ్గిన తర్వాత విల్ట్ తెగులు సోకకుండా బ్లైటాక్స్ లేదా మ్యాన్ కో జెబ్ డ్రెంచింగ్ విధానం ,కెఎన్ఓ 3 పొటాషియం నైట్రేట్ పిచికారీ ,యూరియా పొటాష్ కలిపి మొక్కల మొదల్లో పోకెటింగ్ చేయాలని సూచించారు.రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు సూచనలు పాటించి తుపాను ప్రభావం నుంచి పంటలను కాపాడుకోవాలని సూచించారు.