అకాల వర్షాలపై రైతులు జాగ్రత్తలు పాటించండి
1 min read– వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గత వారం పది రోజుల నుండి అకాల వర్షాలు గడివేముల మండలంలో కురవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సోమవారం నాడు మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సూచనలు సలహాలను రైతులు పాటించాలని తెలిపారు మండలంలో మొక్కజొన్న మిర్చి ఆఖరి దశలో ఉండడం నూర్పిన ధాన్యం కల్లాలో ఉన్నప్పుడు నూర్పిన ధాన్యం రెండు మూడు రోజుల్లో ఎండబెట్టడానికి వీలు కాకపోతే గింజ మొలకెత్తి రంగు మారి చెడు వాసన వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించడానికి ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పును 20 కిలోల పొడి లేక ఒక నాలుగు కిలోల వరిగడ్డితో కలిపి ధాన్యం పోగు పెట్టడం వల్ల గింజ మొలకెత్తి చెడిపోకుండా నివారించవచ్చని . అలాగే కోతకు పది పదిహేను రోజులు దశలో ఉన్న చేను పడిపోయి నీటి మునిగితే బూజు తెగుళ్ల వల్ల గింజ రంగు మారే అవకాశం ఉంటుంది కాబట్టి వర్షాలు తగ్గిన వెంటనే లీటరు నీటికి ఒక మిల్లి లీటర్ ప్రొపి కొనోజాల్. లేక 1.0 గ్రాములు కార్బన్డిజం ప్లస్ మాంకోజెబ్. కలిపి పిచికారి చేయాలని జాగ్రత్తలు పాటిస్తే పంట నష్టం నివారించవచ్చని తెలిపారు.