ఆస్పరిలో… రైతులకు సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలి
1 min readపల్లెవెలుగు:ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పెట్టుబడికి ఎకరాకు 15000 రూపాయలు ఒకేసారి ఇవ్వాలని గరిష్టంగా ఐదు ఎకరాల వరకు ఇవ్వాలి రైతులకు 90 శాతం సబ్సిడీపై అన్ని రకాల విత్తనాలు ఇవ్వాలని సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి రైతు సంఘం మండల అధ్యక్షులు కార్యదర్శి అంజనేయ, ఉరుకుందప్ప మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పెంచి వడ్డీ లేని పంట రుణాలు రైతులకు ఇవ్వాలని జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని కూలి ఖర్చులు ప్రభుత్వమే భరించాలి కవులు రైతులకు సబ్సిడీ విత్తనాలు పంట రుణాలు కౌలుదారులకు రైతు భరోసా పథకం నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు నాణ్యతలేని విత్తనాలు అమ్మే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి లైసెన్సులు రద్దు చేయాలన్నారు లేని పక్షాన రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు అనంతరం డిమాండ్తో కూడిన వినతి పత్రం ఎమ్మార్వో కుమార్ స్వామి గారికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రాజశేఖర్ సిపిఐ నాయకులు ఆంజనేయ రామన్న రామాంజనేయ రైతు సంఘం నాయకులు ఉరుకుందప్ప ఎల్లప్ప దస్తగిరి హనుమంతు ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు లక్ష్మన్న శ్రీనివాసులు ఏఐటీయూసీ నాయకులు హనుమంతు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.