PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులను తక్షణమే ఆదుకోవాలి

1 min read

– కలెక్టర్ కు నివేదిక పంపుతాను అన్నా తాసిల్దార్ రమేష్
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: అధిక వర్షాలు నకిలీ విత్తనాలు తెగుళ్ల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం కల్లూరు మండల కమిటీ ఆధ్వర్యంలో కల్లూరు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది ధర్నా కార్యక్రమానికి ఏపీ రైతు సంఘంకల్లూరు మండల కార్యదర్శి ఏ కృష్ణ అధ్యక్షతన జరిగినది ధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 20 రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల ఉల్లి పత్తి మిరప మొక్కజొన్న టమేటా తదితర పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని నష్టపోయిన రైతులను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత మూడు సంవత్సరాలుగా రైతులు ఏదో ఒక రకంగా నష్టపోతున్నారని నష్టపోతున్న రైతులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉందని ఆయన హితవు పలికారు ఈ సంవత్సరం ఖరీఫ్ లో వేసిన ఉల్లి పంట దిగుబడి లేక ధర లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో అధిక వర్షాలు వచ్చి పూర్తిగాఉల్లి పంట కోల్పోయిన పరిస్థితి ఉందని రైతులు లబోదిబోమంటున్నారని దూపాడు బొల్లవరం బస్తిపాడు ఉల్లెందుకొండ చిన్నటేకూరు తడకనపల్లె వామసముద్రం పుసులూరు రేమడూరు తదితర గ్రామాలలో ఉల్లి పంట వేసి తీవ్రంగా నష్టపోయారని రామకృష్ణ తెలిపారు అదే రకంగా పత్తి పంట వేసిన రైతులు గత సంవత్సరం రేటు బాగా పలకడం వలన అత్యధిక మంది రైతులు పత్తి పంట వైపు మళ్లారని దీనిని అదునుగా చూసుకున్న వ్యాపారస్తులు బీటీ విత్తనంలో కల్తీ విత్తనాలు కలిపి రైతులను మోసం చేసి సొమ్ము చేసుకున్నారని గోకులపాడు గ్రామంలో మహేశ్వర్ రెడ్డి అనే రైతు సుమారుగా పదహారు ఎకరములు అకిరా అనే విత్తనం వేసి పూర్తిగా నష్టపోయాడు మొగ్గ గాని పిందే గాని ఏమాత్రం రాలేదు పర్ల గ్రామానికి చెందిన నడిపి మద్దిలేటి ఆదిత్య అనే రకం విత్తనం 20 ఎకరాల్లో వేసి ఎకరాకు 50 వేల దాకా ఖర్చు పెట్టితే ఒక క్వింటాలు కూడా దిగుబడి రాలేదు పైగా ఎర్ర పురుగు తామర పురుగు లాంటి తెగుళ్లతో మరియు అధిక వర్షాలు రావడం వలన పత్తివేసిన రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని అన్నారు మిరప మొక్కజొన్న టమోటా పంటలు కూడా నష్టపోయాయి ఈ విషయమై ఇప్పటికే వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల వారికి హార్టికల్చర్ ఏడీ దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు ఈ సంవత్సరం ఖరీఫ్లో పంటలు వేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు . కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది ముందుస్తుగా ఎకరాకు 15000 ముందస్తుగా కౌలు చెల్లించి పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున నష్టపోయారని కౌలు రైతుల పట్ల ప్రభుత్వము మొసలి కన్నీరు కార్చడం తప్ప వారిని ఆదుకునే చర్యలు ఏమాత్రం తీసుకోలేదని భూ యజమానితో సంబంధం లేకుండా సీసీ కార్డులు ఇవ్వకుండా భూ యజమానితో లింకు పెట్టడం వలన సీసీ కార్డులు లేకపోవడం వలన నష్టపరిహారంగాని ఇతర సంక్షేమ పథకాలు గాని కౌలు రైతులకు వర్తించడం లేదు ఇప్పుడు అత్యధికంగా నష్టపోయిన వారు వీరే ఉన్నారని ఆయన తెలిపారు తక్షణమే ప్రభుత్వము జిల్లా అధికారులు స్పందించి రైతులను కౌలు రైతులను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన రైతులందరినీ కౌలుసమీకరణ చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని ఆయన హెచ్చరించారు అనంతరం కల్లూరు తహసిల్దార్ రమేష్ కు కల్లూరు మండలం లో నష్టపోయిన పంటలతో కూడిన వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా తాసిల్దార్ రమేష్ స్పందిస్తూ న్యాయమైన డిమాండ్ అని తక్షణమే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం జరగడానికి తగు చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు హరిబాబు రంగస్వామి లక్ష్మన్న సుదర్శనం బిజీ విధేయుడు కే వెంకటేష్ పర్ల మద్దిలేటి గోపాల్ సురేష్ డివైఎఫ్ఐ కల్లూరు మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు రైతులు పాల్గొన్నారు.

About Author