PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులు ముందుకు రావాలి : డ్వామా ఏపిడి

1 min read

పల్లెవెలుగు, వెబ్ మి​డుతూరు:మండల పరిధిలోని చింతలపల్లి గ్రామములో వచ్చే ఆర్థిక సం:లో చేపట్టబోయో పనులను ప్రణాళిక బద్దంగా గుర్తించి పనులను జియోట్యాగింగ్ చేయాలని డ్వామా ఏపిడి వెంకట చలపతి ఉపాధి సిబ్బందిని ఆదేశించారు.పనుల గుర్తింపు లో వాలంటీర్లను ఉపయోగించుకోవాలని అన్నారు.ఇన్వ్యాలిడ్ అకౌంట్, రిజెక్ట్ పేమెంట్ ఎన్ఎంఎంఎస్ యాప్ మరియు గ్రామానికి ఎంత లేబర్ బెడ్జెట్ ఉందో వాటికి తగిన పనులు గుర్తించాలన్నారు.పండ్ల తోటల పెంపకం,హార్టికల్చర్ పట్ల రైతులకు అవగాహన కల్పించి వారు ముందుకు వచ్చే విధంగా చూడాలని అన్నారు.తర్వాత దేవనూర్ గ్రామంలో రైతు నాగశేషులు వేసిన జామతోటను ఏపిడి పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.తర్వాత మిడుతూరు ఉపాధి సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఏపీఓ జయంతి, చింతలపల్లి పంచాయితీ కార్యదర్శి వినయ్ చంద్ర,జలకల స్వాములు,ప్లాంటేషన్ సూపరవైజర్ నాగరాజు మరియు ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

About Author