PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులు ఈ నెల 4వ తేదిలోపు ఈకేవైసి పూర్తి చేయించుకోవాలి

1 min read

– వంద శాతం ఈ-కెవైసి నమోదు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
– జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రబీ ఈ-క్రాప్ బుకింగ్ వంద శాతం పూర్తి అయ్యిందని, ఈ క్రాప్ లో నమోదు అయిన పంటల వివరాలను రైతులందరూ సరిచూసుకొని ఈ నెల 4 వ తేదీ లోపు ఈ-కెవైసి చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు రైతులకు విజ్ఞప్తి చేశారు.శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వ్యవసాయ,అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ రబీ ఈ-క్రాప్ బుకింగ్ వంద శాతం పూర్తి చేశారని, అయితే ఈ-కెవైసి 91 శాతం మాత్రమే పూర్తి చేశారన్నారు. ముఖ్యంగా ఆస్పరి,చిప్పగిరి , మద్దికెర, కృష్ణగిరి మండలాల్లో ఈ-కెవైసి లో వెనుకబడి ఉన్నారని, గురువారం లోపు 90 శాతం పైగా పూర్తి చేయాలని ఆయా ఏడిఏ లను ఆదేశించారు.. పక్కన ఉన్న మండలాల వ్యవసాయ సిబ్బందిని డిప్యూట్ చేసి ఈ-కెవైసి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. అదే విధంగా సోషల్ ఆడిట్ ను 8వ తేది నుంచి 12వ తేది లోపు పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.. . రైతు భరోసా కేంద్రాల పనితీరు మరింత మెరుగుపడే లా వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి పెట్టాలన్నారు.. చిరుధాన్యాల పెంపకంలో రైతులను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. వేరుశనగ సాగులో చిరుధాన్యాలు అంతర పంటలుగా సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు . వైయస్సార్ యంత్ర సేవా పథకం కింద CHC గ్రూపుల నిర్దేశిత గడువు లోపు ఏర్పాటు చేయాలన్నారు.ఉద్యాన పంటలు సాగు ను విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారిని ఆదేశించారు.గ్రీన్ హౌస్ technolgy ద్వారా పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలన్నారు ..ముఖ్యంగా ఆదోని ఏరియాలో ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను రైతులకు వివరించి, వారికి వర్తింప చేయాలని సూచించారు.. సూక్ష్మ సేద్యం అమలులో భాగంగా డ్రిప్, తుంపర పరికరాలను లక్ష్యం మేరకు త్వరితగతిన అందించాలని సూచించారు..బనవాసిలో ఫాడ ర్ రీసెర్చ్ మరియు ప్రొడక్షన్ స్టేషన్ ఏర్పాటు తో పాటు ఆదోని,ఎమ్మిగనూరులో మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్ కు సంబంధించిన ప్రతిపాదనలు త్వరితగతిన రూపొందించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రామచంద్రయ్యను ఆదేశించారు.సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి.ఎల్.వరలక్ష్మి, APMIP పిడి ఉమాదేవి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

About Author