రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : వర్షపాతం తక్కువగా నెలకొన్న సందర్భంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి తెలిపారు, శుక్రవారం చెన్నూరు మండల కేంద్రంలో వ్యవసాయ సలహా మండలి సర్వసభ్య సమావేశం మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు ఎర్ర సాని మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే రైతులు విత్తనం గురించి అలాగే పంటల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి, రైతు భరోసా కేంద్రాలలో రైతులు అవగాహన కార్యక్రమాలకు హాజరై తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, అనంతరం మండల వ్యవసాయ సలహా మండల అధ్యక్షుడు ఎర్ర సాని మోహన్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు అయినటువంటి జొన్న, మినుము పెసర కు సంబంధించినటువంటి ఇండెంట్ పెట్టడం జరిగినదని తెలిపారు, రైతులు వీటిపై అవగాహన కలిగి ఉండడమే కాకుండా, పంట నమోదు చేసుకునే దానికి ఖరీఫ్ సీజన్ ఆఖరి తేదీ సెప్టెంబర్ 15, కనుక ఇంకా పంట నమోదు చేయించుకోని రైతులు వెంటనే చేయించుకోగలరని వారు తెలియజేశారు, వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, వరిలో దోమపోటు గమనించడం జరిగినదని, దోమపోటు నివారణకు మందులు పిచికారితో పాటు పైపాటుగా నత్రజని ఎరువులను వేయడం తగ్గించాలని అదేవిధంగా పొలంని ఆరబెడుతూ నీరు పెడుతూ ఉండాలని రైతులకు తెలియజేశారు, నివారణకు డైనోటో ఫ్యూరాన్ 20% SG 70-80 గ్రా /ఎకరాకు లేదా ఫ్లోనికామిడ్ 50%SG -70-80 గ్రా లేదా పైమెట్రోజైమ్ 50% wG -120 గ్రా వీటిలో ఏదో ఒక మందు ఉదృతిని బట్టి రెండుసార్లు వారం వ్యవధిలో పిచికారి చేయాలని ఆమె సూచించారు, ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.