రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
1 min read– మండల వ్యవసాయ సలహా మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఎంపీపీ చీర్ల
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలో ఖరీఫ్ 2023 సంవత్సరం కు గాను కేసి కెనాల్ కింద సాగు చెయ్యని పంట పొలాలలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు ఎర్ర సాని మోహన్ రెడ్డి,ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు అన్నారు, శుక్రవారం చెన్నూరు రైతు భరోసా కేంద్రంలో మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు ఎర్ర సాని మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు ఖరీఫ్ పంటలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా ఎంపీపీ, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మాట్లాడుతూ, కేసీ కెనాల్ కింద పంటలు సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు, ఇందుకుగాను ప్రభుత్వం సబ్సిడీతో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు, అందులో భాగంగా మండలంలోని, ఆయా రైతు భరోసా కేంద్రాలలో విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని వారు తెలిపారు, ఇవి ప్రభుత్వం ద్వారా రైతులకు 80% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు, వర్షా భావం కారణంగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు , కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం తో మీ దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలలో విత్తనాలు పొందగలరని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మండల అగ్రికల్చర్ అధికారి శ్రీదేవి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ జి. రామకృష్ణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.