ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రైతులు సాగు పద్ధతులు తెలుసుకోవాలి
1 min readపల్లెవెలుగు , వెబ్ చెన్నూరు : ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రైతులు మెలకువలు తెలుసుకొని సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయని ఉద్యాన సంచాలకులు ఎస్ ఎస్ వి సుభాషిని తెలిపారు, ఈ సందర్భంగా ఆమె సోమవారం మండలం లోని ఉప్పరపల్లి గ్రామంకి చెందిన జగన్మోహన్ రెడ్డి అనే రైతు కు చెందిన ఉద్యాన పంటలు వ్యవసాయ పంటల్ని పరిశీలించడం జరిగింది. ఉద్యాన పంటలు చీనీ, నిమ్మ, జామ, అంజూర, సీతాఫల్, కొబ్బరి, మునగ, నేరేడు 3 అంచల పద్ధతిలో సాగు చేస్తున్నారని తెలిపారు, రైతులు ఉద్యాన రైతు ఉత్పత్తుదారుల సంఘంగా ఏర్పడాలని ఆమె సూచించారు, అలాగే ఇంకా కొంత మంది రైతులను ప్రోత్సహించి సంఘంగా ఏర్పడి ఉత్పత్తుల సేకరణ కేంద్రం శీతల గది ఏర్పాటు చేసుకొని వ్యాపార సరళిలో పద్ధతులు మెలకువలు తెలుసుకోవాలని చెప్పడం జరిగింది, అలాగే శాశ్వత పందిరి ఏర్పాటు చేసుకొని తీగజాతి కూరగాయలు సంవత్సరం పొడుగునా సాగు చేసుకోవచని, తేనెటీగల పెట్టెలను పెట్టుకోవాలని ఉద్యాన అధికారి జ్యోతిర్మయి రైతులకు తెలియజేశారు, కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా డ్రోన్ తీసుకొని కషాయనాలను పిచికారి చేసుకోవాలని వ్యవశాయ అధికారి శ్రీదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో AEO , రైతులు పాల్గొన్నారు.