సాగునీటి కోసం గళమెత్తిన రైతులు….
1 min read– కె.సి.కెనాల్, SRBC, తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు -నగరి ఆయకట్లకు తక్షణమే నీటిని విడుదల చేయాలి
– శ్రీశైలం రిజర్వాయర్ లో 875 అడుగుల పైననే విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలి
– రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కె.సి.కెనాల్, SRBC, తెలుగుగంగ, హంద్రీ-నీవా అసయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాయలసీమ సాగునీటి సాధన సమితి పిలుపుమేరకు తరకివచ్చిన SRBC, తెలుగుగంగ, కె.సి.కెనాల్ ఆయకట్టు రైతులతో కలిసి కె.సి.కెనాల్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుమలేశ్వరరెడ్డి, నంద్యాల జిల్లా రెవిన్యూ పరిపాలన అధికారి (DRO) పుల్లయ్య లకు ఈ మేరకు వినతిపత్రం అందజేసినారు.శ్రీశైలం రిజర్వాయర్ నీటి లభ్యతపై అనుమానాలున్న ప్రస్తుత సందర్భంలో విద్యుత్ ఉత్పత్తి కంటే త్రాగునీటికి, తరువాత సాగునీటికి ప్రాధాన్యత ను ఇవ్వాలని, ఈ నేపథ్యంలోనే శ్రీశైలం రిజర్వాయర్ లో 875 అడుగుల పైన ఉన్నప్పుడే విద్యుత్ ఉత్పత్తిని చేపట్టాలని అధికారులకు సమితి నాయకులు విజ్ఞప్తి చేశారు.SRBC, కె.సి.కెనాల్, తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల రిజర్వాయర్లకు తక్షణమే నీటిని విడుదల చేసి ఆయా ఆయకట్లకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.చట్టప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ నుండి విద్యుత్ ఉత్పత్తికి వినియోగించాల్సిన కృష్ణా జలాలు నాగార్జున సాగర్ ఆయకట్టుకు కేటాయించింది 264 tmc లు మాత్రమేనని, కానీ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ చట్ట ఉల్లంఘన జరుగుతోందని, దీని వలన రాయలసీమ రైతాంగం తీవ్రంగా నష్డపోతోందని, కావున శ్రీశైలం రిజర్వాయర్ నుండి కేవలం 264 tmc లనే విద్యుత్ ఉత్పత్తి చేపట్టేలా చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని రాయలసీమ రైతాంగం డిమాండ్ చేస్తున్న విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని అధికారులకు సమితి నాయకులు విజ్ఞప్తి చేశారు.పూర్తిగా నిర్వీర్యమైన అలగనూరు, పాక్షికంగా దెబ్బతిన్న గోరుకల్లు రిజర్వాయర్ ల పునరుద్దరణ యుద్దప్రాతిపదికన చేపట్టాలని సమితి నాయకులు డిమాండ్ చేసారు.తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు నుండి విద్యుత్ ఉత్పత్తి చేయకుండా నిలవరించడానికి రాయలసీమ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమితి నాయకులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.గుండ్రేవుల రిజర్వాయర్, సిద్దేశ్వరం అలుగు నిర్మాణాలపై ప్రభుత్వం ప్రతిపాదలకే పరిమితం అవుతోందని ప్రజల డిమాండ్ మేరకు ఈ రెండు ప్రాజెక్టల నిర్మాణాలను ప్రభుత్వం చేపడితే రాయలసీమలో కొంతవరకు కరువును నిర్మూలించడమేగాక, వలసలను అరికట్టవచ్చని సమితి నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చేశారు. ఈ కార్యక్రమాలలో కె.సి.కెనాల్ , తెలుగుగంగ, SRBC ఆయకట్టు ప్రాంతాల గ్రామ నాయకులు, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.