విజయవంతంగా కోకో,కొబ్బరి,ఆయిల్ ఫామ్ అంతర పంటలతో రైతులు సాగు
1 min read
గత కొన్ని సంవత్సరాలుగా రైతులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు
జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎస్ రామ్మోహన్రావు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : మన రాష్ట్రంలో కోకో ను కొబ్బరి ఆయిల్ ఫాం తోటలో అంతర పంటగా విజయవంతంగా సాగు చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా రైతులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎస్ రామ్మోహన్ తెలిపారు. కోకో గింజలకు జాతీయంగా అంతర్జాతీయమైన డిమాండ్ మరియు పంట దిగుబడిలో కలిగిన ఒడుదుడుకుల వలన సాధారణంగా ఒక కేజీ నాణ్యమైన ఎండు గింజ ఖరీదు 200 నుండి 250 వరకు ఉండేదల్లా గత సంవత్సరం 2024 లో వెయ్యి రూపాయలు పైబడి ధర పలికి రైతులకు ఎన్నో రెట్లు లాభాలను అందించిందన్నారు. దీంతో రైతులు అంచనాలు పెరుగుతూ పోయాయని. కానీ ప్రస్తుతం కోకో గింజల మార్కెట్ అంచనాలను అందుకోలేక కేజీ 550 రూపాయల నుండి 650 రూపాయలు చొప్పున మంచి నాణ్యమైన గింజలను కొనుగోలుదారులు కొనుగోలు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో సమస్యను రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా రాష్ట్ర ఉద్యాన శాఖ రైతులతో చర్చించి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించగా చాక్లెట్ తయారీలో ప్రధాన ముడి సరుకుగా ఉపయోగించే కోకో గింజలను నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తయారుచేసి అమ్మకానికి ఉంచడం జరిగిందని గమనించి తక్షణమే ఈ సమస్య ను నివారించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కోకో గింజల నాణ్యత లో కీలకమైన ఫైర్మెంటేషన్, ఎండబెట్టడం మరియు శుభ్రమైన ప్రదేశాలలో భద్రపరచడం వంటి మెళకువలను మోండలీజ్ సాంకేతిక అధికార్లు మేనేజ్ మెంట్ సమన్వయం ముఖ్యమైన గ్రామాలలో శిక్షణ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. కొంత మంది రైతులు గత సంవత్సరం’ అన్ సీజన్ (నాసిరకం) పంటను దాచి అధిక ధరలకు అమ్మాలని సరిగా భద్రపరచక ఎక్కువ శాతం పాడైపోయాయన్నారు. ఈ గింజలను శుభ్రపర్చి విడిగా ఉంచుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఈ సూచనలను రైతులందరూ తప్పక పాటించి నాణ్యత ప్రమాణాలతో గింజలను తయారు చేస్తే కొనుగోలుదార్లు కొనడానికి ముందుకు రావడం జరుగుతుందన్నారు. సమస్య ప్రభుత్వందృష్టికి వచ్చిన వెంటనే రైతులకు నాణ్యత ప్రమాణాలు పెంచడానికి తోటలలో నే మోండలీజ్ కంపెనీ సమన్వయం తో వివిధ గ్రామాలలో శిక్షణాకార్యక్రమాలు చేపట్టడం జరిగినదన్నారు.ఆదివారం రామశింగవరం, కొండల రావుపాలెం, చక్రాదేవర పల్లి, వంగూరు, తాళ్ళగోకవరం వగైరా గ్రామాలలో నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేసి అవగాహనను పెంచి కోకో గింజల నాణ్యత ను పెంచి మార్కెట్ ను స్థిరపరచే ఏర్పాటు చేపట్టడం జరిగిందన్నారు.