మాధవరం ఇస్పాట్ స్టీల్ ఫ్యాక్టరీ తో రైతులకు నష్టం
1 min read
మంత్రి కి, జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన పైబావి అమర్నాథ్ రెడ్డి, మజ్జిగ శ్రీనివాసులు
పరిశీలన కు సూగురు ఎస్ ఎస్ వాటర్ ట్యాంక్ నీరు
పొల్యూషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ రెడ్డి విచారణ
మంత్రాలయం, న్యూస్ నేడు : మండల పరిధిలోని మాధవరం సమీపంలో ఉన్న ఇస్పాట్ స్టీల్ ఫ్యాక్టరీ నుండి వచ్చే డస్ట్ (బూడిద) వల్ల రైతుల పంట పొలాలు పండక పోవడంతో రైతులు నష్టపోతున్నారని మాధవరం గ్రామానికి చెందిన పైబావి అమర్నాథ్ రెడ్డి, రచ్చమరి గ్రామానికి చెందిన మజ్జిగ శ్రీనివాసులు ఇటీవల కర్నూలు పర్యటన కు వచ్చిన ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు కు, జిల్లా కలెక్టర్ రంజిత్ భాష కు వినతిపత్రం అందజేశారు. దీంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గురువారం పొల్యూషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ రెడ్డి, ఏఈ రామకృష్ణ మాధవరం ఇస్పాట్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద విచారణ చేపట్టారు. అక్కడ ఉన్న రైతుల పొలాలను పరిశీలించారు. ఫిర్యాదు చేసిన రైతుల ను, చుట్టుపక్కల ఉండే రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం నిబంధనలు అమలు చేయడం లేదని, దీని నుండి వచ్చే డస్ట్ పంటపొలాల పై పడుతున్నాయని, దీంతో తమకు నష్టం వస్తుందని ఆయన రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆయన ఇప్పుడు పొలాల్లో పంటలు లేవని ఎలా గుర్తించాలని రైతులకు ప్రశ్నించారు. వర్షాలు పడితే పొలాల్లో పంటలు సాగు చేస్తున్నప్పుడు వచ్చి విచారణ చేపడతామని రైతులకు తెలిపారు. మీరు ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా అధికారులకు నివేదిక ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు. పరిశీలన కు సూగురు ఎస్ ఎస్ ట్యాంకు నీరు సేకరణ : – రైతులు ఫిర్యాదు చేయడంతో సూగురు సమీపంలో నిర్మించిన ఎస్ ఎస్ ట్యాంకు లో ఫ్యాక్టరీ డస్ట్ పడుతుందని పొల్యూషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్లడం తో నీటిని పరిశీలన కు తీసుకెళ్లారు. నీటి ని పరిక్షించి నివేదిక జిల్లా అధికారులకు అందచేస్తామని వారు తెలిపారు. అయితే విచారణ కు వచ్చిన అధికారులు ఫ్యాక్టరీ లోపల వెళ్లకుండా రోడ్డు పై నే రైతుల ను విచారణ జరిపి వెళ్లడం పై రైతులు పలువిధాలుగా చర్చించుకుంటున్నారు. ఈ విచారణ లో రైతులు పైబావి కృష్ణ మోహన్ రెడ్డి, పైబావి నర్సిరెడ్డి, ఉలువ లక్ష్మన్న, నవకోటి నారాయణ, నర్సిరెడ్డి, అయ్యప్ప, అంజిని, ఉలువ దుళ్లయ్య, భీమరాయుడు, నర్సిరెడ్డి, గుడిసే నరసింహులు, ఉలువ అయ్యన్న, గజలయ్య నర్సిరెడ్డి,ఎర్రకోట నాగప్ప, ఓంకార్ నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు.
