PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతు సంక్షేమమే..ప్రభుత్వ ధ్యేయం..

1 min read

ఉచిత పంటల బీమా చెక్కును అందించిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

పల్లెవెలుగు, ఏలూరు:  బుట్టాయిగూడెం. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు.  వై.ఎస్.ఆర్. రైతు దినోత్సవం సందర్భంగా స్థానిక ఎండిఓ కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో వై.ఎస్.ఆర్. ఉచిత పంటల భీమా పరిహారం మెగా చెక్కును రైతులకు ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ  రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వ కాలంలో సాగు కష్టంగా ఉండేదని, రైతులు ఎన్నోవిధాల నష్టపోయారన్నారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశారని, రైతు భరోసా, పంటరుణాలు, వడ్డీ లేని రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించడం, ఉచిత విద్యుత్, ఉచిత పంటల భీమా పధకం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా  ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లో పెట్టుబడి సహాయం రైతులకు అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు విత్తు నుండి పండిన పంట ను అమ్మేవరకు వెన్నంటి ఉండేలా ప్రతీ గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు.  ఈ కేంద్రాలలో రైతులకు సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పంటల కొనుగోలు, వంటి  అన్ని సహాయ కార్యక్రమాలు అందుతున్నాయన్నారు.  ప్రజలకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేసే నిమిత్తం ఏలూరు జిల్లాలో  మూడు  అగ్రి ల్యాబ్ లను కొయ్యలగూడెం, గోపన్నపాలెం, కైకలూరులలో  ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో 3161 మంది రైతులకు 2 కోట్ల 21 లక్షల 30 వేళా 246 రూపాయలు పంటల భీమా పరిహారంగా విడుదల చేయడం జరిగిందన్నారు.  రాష్ట్రముఖ్యమంత్రి అనంతపురం జిల్లా నుండి ఉచిత పంటల భీమా విడుదల కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖాధికారి వై. రామకృష్ణ, రాష్ట్ర  ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ గంజి మాలాదేవి, మండలాధ్యక్షులు కారం చంటి, సుంకర వెంకటరెడ్డి, జెడ్పీటిసి లు మొడియం రామతులసి, దాసరి శ్రీలక్ష్మి, సర్పంచ్ తెల్లం వెంకాయమ్మ, ఐటీడీఓ వ్యవసాయాధికారి బుచ్చిబాబు, వివిధ మండలాల వ్యవసాయాధికారులు, సర్పంచ్ లు, ప్రభృతులు పాల్గొన్నారు. అనంతరం కొయ్యలగూడెం లో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్ ను శాసనసభ్యులు తెల్లం బాలరాజు ప్రారంభించారు.

About Author