యాజమాన్య పద్ధతులపై రైతులకు పొలంబడి..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని దుర్వేసి గ్రామంలో మంగళవారం నాడు వరి పంట.పై పొలంబడి కార్యక్రమాన్ని రైతు పరమేశ్వర రెడ్డి పొలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏవో హేమ సుందర్ రెడ్డి. పొలంబడి సూత్రాలు, నీటి తడులు ఆవశ్యకత , ఎరువులు వాడకం మరియు చీడపీడల కు తీసుకోవలసిన నివారణ చర్యలపై రైతు సోదరులకు అవగాహన కల్పించారు ఖరీఫ్ సీజన్లో అయితే చదరపు మీటర్కి 33 మొక్కలు, రబి సీజన్లో అయితే చదరపు మీటర్ కి 44 కుచ్చులు ఉండాలని. తక్కువ పెట్టుబడితో అధిక నాణ్యమైన దిగుబడిని పొందటం గురించి తెలియజేశారు.