కొడుకు సినిమా పై తండ్రి విమర్శలు !
1 min readపల్లెవెలుగువెబ్ : తమిళ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్వయంగా దర్శకనిర్మాత. ఆయన తన తనయుడు నటించిన ‘బీస్ట్’ చూసి చాలా డిజపాయింట్ అయ్యాడట. సినిమాలో కొరియోగ్రాఫర్ పనితనం, ఫైట్ మాస్టర్ ప్రతిభ, హీరో శ్రమ ఇలా అన్నీ కనిపిస్తున్నాయి. కానీ, ఎక్కడా దర్శకుడు నెల్సన్ మాత్రం కనిపించలేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు. చాలా మంది కొత్త దర్శకులు ఇదే పని చేస్తున్నారని ఆయన ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. మొదటి చిత్రం క్రియేటివ్‌గా, టెక్నికల్‌గా చక్కగా తీస్తారని చెప్పిన ఆయన రెండో సినిమా కూడా జాగ్రత్తగానే తెరకెక్కిస్తారని అన్నాడు. ఇక మూడో సినిమాకల్లా పెద్ద హీరోల నుంచీ ఆపర్స్ రావటంతో యంగ్ డైరెక్టర్స్ హోమ్ వర్క్ మానేస్తారని చంద్రశేఖర్ కుండబద్ధలు కొట్టాడు. కథ, కథనం వంటివి పట్టించుకోకుండా స్టార్ హీరో డేట్స్ దొరకగానే నేరుగా సెట్స్ మీదకి వచ్చేస్తారని విమర్శించాడు. అందుకే, ‘బీస్ట్’ లాంటి సినిమాల్లో స్క్రీన్ ప్లే లోపం స్పష్టంగా కనిపిస్తుంటుందని చెప్పుకొచ్చాడు.