ఫాదర్ దేవదాసు కు ఘనస్వాగతం
1 min readపల్లెవెలుగు, వల్లూరు:కడప బిసఫ్ హౌస్ కోశాధికారి, ఫాదర్ దేవదాసుకు ఆదివారం వల్లూరులో భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. బాల యేసు చర్చికి వచ్చారు. వల్లూరు మండలం బాలుగారి పల్లెకు చెందిన దేవదాసు 2009 డిసెంబర్ మూడో తేదీన అభిపక్తులై మైదుకూరు, మరియాపురం, బద్వేల్ చిత్తూరు చర్చిలలో పనిచేస్తూ రెండు సంవత్సరాల పాటు బెంగళూరులో ఫిలాసఫీస్ చదివి అనంతరం బి కోడూరులో పని చేసిన ఆయన ప్రస్తుతం కడపలోని బిస్అప్ కోశాధికారిగా పనిచేస్తున్నారు, 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వల్లూరులోని బాల యేసు చర్చిలో దివ్య బలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల యేసు చర్చి గురువు శరత్ మాట్లాడుతూ వల్లూరు ముద్దుబిడ్డ అయినా పెండ్లికట్ల దేవదాసు తన వార్షికోత్సవాన్ని వల్లూరులో నిర్వహించడం సంతోషించదగ్గ విషయం అన్నారు, మన విచారణ అభివృద్ధి పరుష్టకై ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరచడంలో ఎంతో కృషి చేస్తున్నారన్నారు, ఆయన భవిష్యత్తులో మరెన్నో పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పోరమామిళ్ల బి కోడూరు ఉల్లూరు చర్చిల పరిధిలో ఉన్న భక్తులు పాల్గొని దేవదాసును ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.