ఘనంగా ఫాదర్ ఇమ్మానుయేలు తాతిపూడి జన్మదిన వేడుకలు
1 min read
సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధ,వితంతు మహిళలకు చీరలు పంపిణీ
ఆయన సేవలను కొనియాడిన పలువురు ప్రతినిధులు,సంస్థ పెద్దలు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : సోషల్ సర్వీస్ డైరెక్టర్ ఫాదర్ ఇమ్మానుయేలు పుట్టినరోజు వేడుకలు ఏలూరు డయాస్ సోషల్ సర్వీస్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఇమ్మానియేల్ పుట్టినరోజు వేడుకలను నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పెరికె వరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ తరఫున వృద్ధ, వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఫాదర్ ఇమాన్యుల్ అందరికీ సహాయం చేయడంలో ఆయన ఆదర్శనీయులని, నిజాయితీకి నిలువుటమని కర్ణాటక విపత్తుల సమయంలో విజయవాడ పోలవరం కుక్కునూరు వరద బాధితులకు ఎనలేని సహాయ కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. పేదలపాలిటీ పెన్నిదిగా పేరుగాంచి ఎంతోమంది పేద విద్యార్థినీ, విద్యార్థులకు చదువులకి సహాయ సహకారాలు అందించిన మహనీయులని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అబ్రహం మాస్టర్, సోషల్ సర్వీస్ అకౌంటెంట్ మ్యాచ్యు, జక్కులు బెనర్జీ, జాన్ గురునాథం,పొలిమేర హరికృష్ణ, కలపాల రవి, అజయ్ బాబు, ఎమ్మార్పీఎస్ నాయకులు రమేష్, దోమనిక్, దీన గ్లాడి, కృపానందం, వీరస్వామి వివిధ సంస్థల సమస్తల సిస్టర్స్ , ఫాదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి రెవరెండ్ ఫాదర్ తాతపూడి ఇమాన్యుల్ ని శాలువా కప్పి పూల బొకేలు అందించి ఘనంగా సత్కరించారు.
