PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఫాదర్ మోసెస్ జన్మదిన వేడుకలు..

1 min read

– బాల్యం నుండే ఆధ్యాత్మిక నిర్దేశంలో ఉండడం శుభ పరిమాణం..

– రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ జంగం రాజేంద్రప్రసాద్..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  పెదవేగి మండలం స్థానిక దుగ్గిరాల డెంటల్ కళాశాలలో కాలేజీ కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ మోసెస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ జంగం రాజేంద్రప్రసాద్ దుస్సాలువ కప్పి పూల బొకేలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ బాల్యం నుంచే రెవరెండ్ ఫాదర్ మోసెస్ ఆధ్యాత్మిక మార్గనిర్దేశంలో నడవడం వలనే ఈరోజు ఉన్నత స్థాయిలో నిలబడగలిగరని, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎనలేనివని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ బి రెబ్కా రాణి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు హైమావతి పాల్గొన్నారు.

About Author