PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయచోటి మున్సిపల్ 2వ వైస్ చైర్మన్ గా ఫయాజుర్ రెహమాన్

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచనలతో రాయచోటి మున్సిపల్ పాలకవర్గం 2 వ వైస్ చైర్మన్ గా వైకాపా సీనియర్ నాయకులు , 9 వ వార్డు కౌన్సిలర్ గా హ్యాట్రిక్ సాధించిన ఫయాజుర్ రెహమాన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం రెండవ వైస్ చైర్మన్ నియామకపు ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ 2 వ వైస్ చైర్మన్ గా ఫయాజుర్ రెహమాన్ పేరును 20 వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ పి.మదన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించగా 26 వార్డు కౌన్సిలర్ నరసింహారెడ్డి,8 వ వార్డు కౌన్సిలర్ చాన్ భాషా లు బలపరిచారు. దీంతో ఫయాజ్ రెహ్మాన్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఈ మేరకు మున్సిపల్ అధికారులు పయాజుర్ రెహమాన్ కు మున్సిపల్ రెండవ వైస్ చైర్మన్ గా నియామకపు పత్రాన్ని అందజేశారు.మున్సిపల్ 2 వ వైస్ చైర్మన్ గా ఎన్నికైన పయాజుర్ రెహమాన్ కు పలువురు వైకాపా నాయకులు,మున్సిపల్ అధికారులు,సహచర కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలియజేశారు.


About Author