సోషల్ మీడియా వల్ల మానసిక క్షోభ అనుభవించా : బన్నీవాసు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఇంటర్నెట్ స్వేచ్చ కారణంగా తనలాంటి వారు, వారి కుటుంబాలు ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నానని నిర్మాత బన్నీవాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ స్వేచ్ఛకు మద్దతుగా ఇటీవల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. ‘ సోషల్ మీడియా ఉపయోగించడం మొదలుపెట్టిన రోజుల్లో నా ఆలోచన విధానాలు, భావాలు పంచుకోవడానికి మంచి వేదిక అవుతుందనుకున్నా. భావప్రకటన స్వేచ్ఛకు, ఇంటర్నెట్ స్వేచ్ఛకు అవధులు ఉండకూడదని అనుకున్నాను. కానీ రెండేళ్లుగా పరిస్థితులు తారుమారు అయ్యాయి. బాధ్యతలేని భావప్రకటన స్వేచ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛ వల్ల నేను పడ్డ ఇబ్బందులు గురించి తెలియజేయడానికే ఈ లేఖ రాస్తున్నా’ అంటూ లేఖలో నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు.