NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌హిళా అథ్లెట్ త‌ల న‌రికారు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆప్ఘన్ ను ఆక్రమించిన తాలిబ‌న్లు న‌ర‌మేధం సృష్టిస్తున్నారు. త‌మ ఆట‌విక చ‌ర్యల‌తో ప్రజ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నారు. కొన్ని వ‌ర్గాల ప్రజ‌లు, మ‌హిళ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని హ‌త్యల‌కు ఒడిగ‌డుతున్నారు. ఇటీవ‌లే అండ‌ర్-19 జాతీయ వాలీబాల్ క్రీడాకారిణిని దారుణంగా హ‌త్య చేశారు. ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వాలీబాల్ జ‌ట్టు కోచ్ సూరాయా ఆఫ్జాలీ ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని వెల్లడించారు. త‌మ జ‌ట్టులోని క్రీడాకారిణి మ‌హ్జాబిన్ హాకిమిని తాలిబ‌న్లు పొట్టన‌పెట్టుకున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. తాలిబ‌న్ల ఆక్రమ‌ణ నేప‌థ్యంలో ఇద‌ర్దు క్రీడాకారిణులు మాత్రమే దేశాన్ని విడిచి వెళ్లార‌ని ఆమె తెలిపింది. హాకిమి కూడ దేశం వ‌దిలివెళ్లి ఉంటే ప్రాణాలు కాపాడుకుని ఉండేద‌ని ఆమె చెప్పింది.

About Author