కరోనాతో మహిళా కానిస్టేబుల్ మృతి
1 min read– ఆరు నెలల గర్భిణీ కూడా…
పల్లెవెలుగు వెబ్, తోట్ల వల్లూరు: తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే మహిళా కానిస్టేబుల్ జువ్వలపూడి కోమల కరోన వైరస్‌తో మృతి చెందింది. ఆమె ఆరు నెలల గర్భిణీ కావడంతో ..తోట్లవల్లూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నెల 8న కానిస్టేబుల్ కోమలికి కోవిడ్ సోకగా .. తీవ్ర అనారోగ్య పరిస్థితి కారణంగా ఈ నెల 13న టైమ్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. కరోనా పోరాడిన కోమలి శనివారం ప్రాణాలు విడిచింది. ఘంటసాల మండలం కొడాలి గ్రామానికి చెందిన కోమలికి 8 నెలల క్రితం వివాహమైంది. టైమ్ ఆస్పత్రి వద్దకు చేరుకున్న డీసీపీ హర్షవర్ధన్ రాజు, సీఐ నాగప్రసాద్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. కాగా తోట్లవల్లూరు ఎస్ఐ కిశోర్‌బాబు కరోనాతో సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.