NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చింపాంజితో మ‌హిళ ప్రేమ‌యాణం.. జూ సిబ్బంది షాక్ !

1 min read

పల్లెవెలుగు వెబ్ : బెల్జియం దేశానికి చెందిన ఓ మ‌హిళ చింపాంజితో ప్రేమ‌లో ప‌డింది. నాలుగేళ్ల పాటుగా దాన్ని కొన‌సాగిస్తోంది. జూ సిబ్బందికి తెలియ‌డంతో ఆమె ప్రేమ‌యాణానికి ఫుల్ స్టాప్ ప‌డింది. బెల్జియానికి చెందిన టిమ్మర్ మ‌న్స్ యాంట్ వెర్ప్ జూకి వెళ్తుండేది. జూలోని చిటా అనే చింపాంజీతో ప్రేమ‌లో ప‌డింది. కొన్ని రోజుల త‌ర్వాత చింపాంజీకి, టిమ్మర్మన్స్ కి మ‌ధ్య బంధం ఏర్పడింది. ఇద్దరూ ఒక‌రితో మ‌రొక‌రు సంభాషించుకుంటూ.. సైగ‌లు చేసుకునేవారు. గాల్లో ముద్దులు కూడ పెట్టుకునేవారు. కొన్ని రోజుల త‌ర్వాత చింపాంజిలో వింత‌ప్రవ‌ర్తన‌ను జూ సిబ్బంది గ‌మ‌నించారు. విష‌యం తెలుసుకుని టిమ్మర్స్మన్ జూకి రాకుండా నిషేధించారు. మ‌నుషుల‌కు అల‌వాటుప‌డితే ఇత‌ర జంతువుల‌తో చింపాంజిలు కల‌వ‌లేవ‌ని జూ సిబ్బంది చెప్పారు. అందుకే టిమ్మర్స్మన్స్ ను జూకి రాకుండా నిషేధించామ‌ని తెలిపారు.

About Author