జగనన్న కాలనీలో పండుగలా గృహప్రవేశాలు…
1 min read– రాజకీయాలకతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలను అందించాం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జగనన్న లేఅవుట్ కాలనీల్లో నిరుపేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 44 వేల గృహాలు మంజూరు చేశామని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నిరుపేదలందరికీ ఇళ్లు పథకం కింద ప్రతి పేదవాడికి గూడు కల్పించాలన్న ప్రధాన నేపథ్యంలో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 7.43 లక్షల ఇళ్లను పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజవర్గం, సామర్లకోటలో వైఎస్సార్ జగనన్న హౌసింగ్ లేఔట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అందులో భాగంగా నందికొట్కూరు పట్టణం కొణిదెల రోడ్ లోని వైఎస్సార్ జగనన్న కాలనీ లేఔట్ సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జగనన్న కాలనీ గృహల ప్రారంభ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందం రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, నందికొట్కూరు శాసనసభ్యులు తోగూర్ ఆర్థర్, మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, నందికొట్కూర్ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ రబ్బాని, అర్షపోగు ప్రశాంతి, హౌసింగ్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రమాదేవి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ అబ్దుల్ సుకూర్మియా, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ రహాత్ తదితర అధికారులు వీక్షించారు.అనంతరం లబ్ధిదారులచే గృహప్రవేశాలు చేయించారు. గృహప్రవేశాలు ప్రారంభించిన అనంతరం జిల్లా ఇంచార్జి కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 322 వైయస్ జగనన్న లేఔట్లు, సొంత స్థలాలు కలిగిన 44 వేల మందికి గృహాలు మంజూరు చేశామన్నారు. ఇప్పటివరకు 31 వేల గృహాలు లబ్ధిదారులు పూర్తి చేసుకున్నారన్నారు. నందికొట్కూరు మున్సిపాలిటీకి సంబంధించి వైయస్సార్ జగనన్న లేఔట్ లో 526 గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 209 గృహాలు పూర్తి చేసుకొన్న గృహాలకు గృహప్రవేశాలు ప్రారంభించామన్నారు. మిగిలిన గృహాలు వివిధ నిర్మాణ దశలలో ఉన్నాయని ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ ద్వారా రూ. 6.28 కోట్లు ఖర్చు చేశామన్నారు. అంతే కాకుండా మౌలిక సదుపాయాల సంబంధించి త్రాగునీటి సరఫరా కొరకు 67.5 లక్షలు, విద్యుద్దీకరణకు 80 లక్షలు, రహదారుల నిర్మాణానికి 25 లక్షలు, పైలాన్ కొరకు 50 వేల రూపాయలు, ఆర్చి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశామన్నారు. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా నిత్యావసర వస్తువుల సరకులను కూడా ఇక్కడే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పారిశుధ్య చర్యలపై ఫోకస్ పెట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. గతంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు పొందుతున్నారో అదే రీతిలో ఈ కాలనీలో కూడా సంక్షేమ పథకాలు పొందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి తిండి, కూడు, గుడ్డ అత్యవసరమని ఇందులో భాగంగానే ప్రతి నిరుపేద కుటుంబానికి గృహాన్ని నిర్మించి ఇవ్వాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయమన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని జగనన్న లేఔట్ లో 209 మంది గృహాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గృహ నిర్మాణాలే కాకుండా విద్యా, వైద్య ఇతర సంక్షేమ రంగాలకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దపీట వేశారన్నారు.ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయారని, కానీ మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ళస్థలాలను అందిస్తున్నారన్నారు.పేదల గురించి, మహిళల అభివృద్ధి గురించి ఏ రోజు కూడా చంద్రబాబు ఆలోచించిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి మాట ఇస్తే మడమ తిప్పరని ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలు నీటి మీద రాతలు లాంటివని జగన్ మోహన్ రెడ్డి మాటలు రాతి మీద చెక్కిన శిలా శాసనాల లాంటివన్నారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి అండగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ , జిల్లా ఎస్సి విభాగం అధ్యక్షులు సగినేల వెంకటరమణ , ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ విభాగం సభ్యులు చంటిగారి దిలీప్ రాజు , వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వనజ , జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట సుబ్బయ్య , మున్సిపల్ కౌన్సిలర్లు మొల్ల జాకీర్ హుస్సేన్, చాందుబాష , రావుఫ్, వైసీపీ నాయకులు తమ్మడపల్లి విక్టర్, విశ్రాంత పోలీస్ అధికారి పెరుమాల జాన్ , జిల్లా కార్యవర్గ సభ్యులు ఇనాయతుల్లా , సర్వోత్తమ్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, సల్కొటి.గోవర్ధన్ రెడ్డి, రఘు, శివానందరెడ్డి, దేవ సహాయం, పాలమర్రి. రాజు, గౌడ్, షరీఫ్, అయ్యన్న,రమేష్,భాస్కర్, వెంకటస్వామి, పండు, వెంకటసుబ్బయ్య, ముజీబ్,ప్రవీణ్, యోసేపు, సంజన్న,ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.