NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పుష్పపల్లకి సేవలో ఉత్సవమూర్తులు..

1 min read

పల్లెవెలుగు వెబ్​: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లకు పుష్పపల్లకీసేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో వేంచేబు చేయించి ప్రత్యేక పూజలు జరిపించబడతాయి. తదుపరి వివిధపుష్పాలతో అలంకరించబడిన పుష్పపల్లకి మేళతాళాలతో శ్రీ స్వామి అమ్మవార్లను తొడ్కొని వచ్చి పుష్పపల్లకిలో ఊరేగింపు చేయడం జరుగుతుంది. కాగా ఈ విశేష సేవలో ఎర్రబంతి, పసుపు బంతి, తెల్లచేమంతి, పసుపు చేమంతి, కనకాంబరాలు, డచ్స్, అశోక పత్రాలు, కాగడాలు, గ్లాడియేలస్, అస్పెర్ గ్రాస్, జబ్రా, కార్నేషన్, ఆర్కిడ్స్, నందివర్ధనం, గరుడవర్ధనం మొదలైన పలు రకాల పుష్పాలను వినియోగించడం జరుగుతోంది. పురాణాలలో శ్రీశైల మల్లికార్జున స్వామివారు పుష్పప్రియుడని చెప్పబడింది. ఈ కారణంగానే ఆయా కైంకర్యాలన్నీ శ్రీ స్వామివారికి పరిపూర్ణంగా అర్పింపజేయాలనే భావనతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోనూ, సంక్రాంతి మహోత్సవాలలోనూ, దసరామహోత్సవాలలోనూ ఈ పుష్పపల్లకి సేవ నిర్వహించడం జరుగుతోంది.

About Author