NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ హైకోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 158 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను జిల్లా కోర్డుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించనున్నారు. ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22-10-2022

దరఖాస్తులకు చివరి తేదీ: 11-11-2022

అర్హతలు

అభ్యర్థులకు తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అనంతపురం వాసులకు తెలుగు, కన్నడ భాష వచ్చి ఉండాలి. శ్రీకాకులం, విజయనగం జిల్లా అభ్యర్థులకు తెలుగు, ఒరియా వచ్చి ఉండాలి. దీంతో పాటు.. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు తప్పనిసరిగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. దరఖాస్తు ఫీజు

జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి. ఎంపికైన వారికి నెలకు రూ.23,780ల నుంచి రూ.76,730ల వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తుల సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే.. 0863-2372752 నంబర్ కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ మెయిల్ ఐడీ[email protected] కూడా సంప్రదించవచ్చు.

About Author