NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న  ఫీల్డ్ అసిస్టెంట్ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కనందికొట్కూరు మండల ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నాయకులు స్వాములు, శ్రీనివాసులు, మునిస్వామి లు  డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యలయంలో ఎంపీడీఓ శోభారాణి కి  వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనిదినాల విధానం రద్దుచేసి ఫీల్డసిస్టెంట్ లకు కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలన్నారు. పనిదినాల టార్గెట్ విధానం రద్దుచేసి ఫీల్డ్ అసిస్టెంట్లకు అందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మూడు సంవత్సరాలు పూర్తిఅయిన అర్హత, అనుభవం కలిగిన ఫీల్డ్ అసిస్టెంట్లకు అందరికి ప్రమోషన్ సౌకర్యం కల్పించి మున్సిపాలిటి పరిదిలో విలినమైన గ్రామపంచాయితీలలో యదావిధిగా ఉపాధిహమీ పథకం అమలు చేయాలన్నారు. జునియర్, సీనియర్ అనే తారతమ్యం లేకుండ అందరీని ఫీల్అసిస్టెంట్లుగా కొనసాగాంచాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణించినటువంటి ఫీల్అసిస్టెంట్లకు రూ.10 లక్షలు ఎక్స్రేషియా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  ఫీల్డ్ అసిస్టెంట్లు  శాతన కోట స్వాములు,వడ్డేమాను శ్రీనివాసులు,నాగటూరు హైమావతి, బిజినవేముల పద్మావతి,మల్యాల స్వాములు,కొణిదెల పెద్ద శేషన్న,దామగట్ల మునిస్వామి, కోళ్లబాపురం భారతి, కొనేటమ్మపల్లి  సుధీర్, బ్రాహ్మణకొట్కూరు   వలి, తదితరులు పాల్గొన్నారు.

About Author