NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌ది, ఇంట‌ర్ ఫలితాల వెల్లడికి నిపుణుల క‌మిటీ

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఏపీలో ప‌దో త‌ర‌గతి, ఇంట‌ర్ ప‌రీక్షల ర‌ద్దుతో ప‌రీక్షా ఫ‌లితాల పై రాష్ట్ర ప్రభుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఉన్నత విద్యాశాఖ అధికారుల‌తో మంత్రి ఆదిమూల‌పు సురేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వార స‌మీక్ష నిర్వహించారు. ఫ‌లితాల వెల్లడి కోసం ఉన్నత స్థాయి నిపుణుల క‌మిటీ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. ఫ‌లితాల వెల్లడి కోసం వాల్యుయేష‌న్ ఎలా ఉండాల‌న్న దాని పై నిపుణుల క‌మిటీ నివేదిక రూపొందించాల‌ని స్పష్టం చేశారు. 2021-22 విద్యా సంవ‌త్సరం క్యాలెండ‌ర్ త‌యారీ, పాఠ‌శాల‌ల‌ను తెరిచే అంశాల పైన సమీక్షించారు. ప్రస్తుతం క‌రోన థ‌ర్డ్ వేవ్ ముప్పు ఉండ‌టంతో .. పాఠ‌శాల‌ల నిర్వహ‌ణ‌, అవ‌లంబించాల్సిన విధివిధానాల పై స‌మీక్ష నిర్వహించారు.

About Author