జులై 26 నుంచి పదో తరగతి పరీక్షలు..?
1 min readపల్లెవెలుగు వెబ్: పదో తరగతి పరీక్షల నిర్వహణ మీద గురువారం ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకుంటారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. పరీక్షల నిర్వహణకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని చెప్పారు. జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయని అన్నారు. పరీక్షలకు 6.28 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని, వారి కోసం 4 వేల పరీక్షా కేంద్రాలు సిద్దం చేస్తున్నట్టు చెప్పారు. 80 వేల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు. గతంలో 11 పేపర్లు ఉండేవి.. ప్రస్తుతం 7 పేపర్లకే పరీక్షలు పరిమితం చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. సెప్టంబర్ 2 లోపు పరీక్షల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అన్నారు. సీఎం తో భేటీ తర్వాత పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు అధికారికంగా వెలువడే అవకాశం ఉందని వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు.