PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

50 శాతం రిజర్వేషన్లు కోసం పోరాడతాo

1 min read

– బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గ నరేష్
– యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా పిళ్ల శ్రీనివాసరావుకి నియామక అందచేసిన… బోను నరేష్
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: బీసీ లకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గ నరేష్ కోరారు. బీసీ ల సమస్యలు పై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఫిబ్రవరి 8,9 తేదీలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల సమస్యలు పై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టo చేశారు..గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ వర్ధంతి ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గ నరేష్ మీడియా తో మాట్లాడారు…పిళ్ళ శ్రీనివాసరావు ని బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అద్యక్షులు గా,మద్ది శ్రీనివాసరావు ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమించినట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా వారికి నియామక పత్రాన్ని అందచేశారు…విజయవాడలో జరిగిన బహిరంగ సభలో ఆర్.కృష్ణయ్య బీసీల సమస్యలు ని క్షుణ్ణంగా వివరించారని వాటిపై తమపై పోరాటం ఉంటుందన్నారు..బీసీ కుల గణన చేయాలని,బీసీలకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని,, బీసీ లకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి 8,9 తేదీలలో ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తమ డిమాండ్లు పరిష్కరించకపోతే పార్లమెంటు ముట్టడికి దిగుతామని హెచ్చరించారు.. అదే విధంగా బీసీ సంక్షేమ సంఘంలో ఉన్న సభ్యులు బీసీల సమస్యలు పరిష్కారానికి కష్టపడి పని చేయాలని కోరారు..కష్టపడే వారికే సంఘంలో పదవులు ఉంటాయని పని చేయని వారిని తొలగించడం జరుగుతుంది అని చెప్పారు. అనంతరం యువజన విభాగం నూతన అధ్యక్షులు పిళ్ళ శ్రీనివాసరావు నివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో యువజన విభాగం అధ్యక్షులు గా నియమించినందుకు ఆర్.కృష్ణయ్య కు,బోను నరేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ పదవీ తో తనపై బాధ్యత మరింత పెరిగింది అన్నారు..అదేవిధంగా ఆర్.కృష్ణయ్య పై ఎవరైనా నోరుజారి మాట్లాడితే సహించేది లేదన్నారు. రాబోయే రోజుల్లో బీసీ సంక్షేమ సంఘాన్ని 26 జిల్లాల్లో మరింత బలోపేతం చేస్తానని చెప్పారు.. బీసీ లు అందరిని కలుపుకొని తమ సమస్యలు పై పోరాడతామన్నారు…ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పోతిన వర ప్రసాద్,యువజన విభాగం నగర అధ్యక్షులు పి.కిరణ్, రాష్ట్ర మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ మెండే జ్యోతి,, రాష్ట్ర అధికార ప్రతినిధి పట్నాల హరిబాబు,, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు,పిల్లా దినేష్,,ప్రసాద్,కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author