ఓడిపోయిన పార్టీలో పదవుల కొట్లాట..?
1 min readపల్లెవెలుగు వెబ్: గెలిచిన పార్టీలో పదవుల కోసం పాకులాడటం.. కొట్లాడటం విన్నాం. కానీ ఓడిపోయిన పార్టీలో కొట్లాడటం ఏంటని అనుకుంటున్నారా? . అవును . తమిళనాడు అన్నాడీఎంకే పార్టీలో ఇదే జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత అన్నాడీఎంకే పార్టీ.. స్వీయ విశ్లేషణ మానేసి, ప్రతిపక్ష నేత పదవి కోసం ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు విశ్లేషణ చేయడం, భవిష్యత్ కార్యాచరణ రచించడం మానేసి రెండు వర్గాలుగా చీలి.. ప్రతిపక్షనేత పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాల మధ్యలోకి జయలలిత సన్నిహితురాలు శశికళ అడుగుపెట్టారు. పన్నీర్ సెల్వం వర్గానికి మద్దతు ఇస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఎదుట శశికళకు మద్దతుగా పోస్టర్లు వెలిశాయి. ఎంజీఆర్ స్థాపించిన పార్టీ.. జయలలిత కాపాడిన పార్టీ.. శశికళ ఆధ్వర్యంలో ముందుకు నడపిద్దామని పోస్టర్లలో సారాంశం. ప్రతిపక్ష నేత పదవి ఎవరికి దక్కుతుందనే ఆసక్తి అన్నాడీఎంకే శ్రేణుల్లో మొదలైంది.