NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాబ్ క్యాలెండ‌ర్ మోసం పై పోరాటం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : జాబ్ క్యాలెండ‌ర్ పేరుతో మోస‌పోయిన నిరుద్యోగుల‌కు త‌మ పార్టీ బాస‌ట‌గా నిలిచి పోరాటం చేస్తుంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. ఈనెల 20న అన్ని జిల్లాల్లో ఉపాధి క‌ల్పన అధికారుల‌కు విన‌తి ప‌త్రం అంద‌జేయాల‌ని నిర్ణయించిన‌ట్టు ఆయ‌న చెప్పారు. ప్రభుత్వ శాఖ‌ల్లోని అన్ని ఖాళీల‌ను జాబ్ క్యాలెండ‌ర్ లో చేర్చాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. లక్షల్లో ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ చెప్పిన మాట‌లు న‌మ్మి.. జాబ్ క్యాలెండ‌ర్ చూసిన త‌ర్వాత నిరాశ చెందార‌ని అన్నారు. గ‌త రెండేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం, ప‌రీక్షల‌కు సన్నద్దం అయ్యేందుకు యువ‌త ఎంతో శ్రమిస్తోంద‌ని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 30 ల‌క్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్టు ప‌వ‌న్ తెలిపారు. గ్రూప్ 1,2 విభాగాల్లో కేవ‌లం 36 ఉద్యోగాల‌ను చూపించ‌డం నిరుద్యోగుల‌ను మోసం చేయ‌డ‌మేన‌ని అన్నారు.

About Author