సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధభేరి..టిడిపి
1 min read– సెల్ఫి ఛాలెంజ్ కార్యక్రమం లో భాగంగా
పల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యo నియోజకవర్గం కల్లూరు మండలం కే మార్కాపురం లోని చెన్న రాయుని రిజర్వాయర్ నీ సందర్శించిన పాణ్యo మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి శ్రీమతి గౌరు చరిత రెడ్డి గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూచెన్న రాయుడు తిప్ప రిజర్వాయర్ 1992 లో నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించారు. రిజర్వాయర్ సామర్థ్యం 0.90 టిఎంసి నీళ్లు నిలువ ఉంటుంది. ఇప్పటికీ సుమారు 30 ఏళ్లు పూర్తి అయిన ఈ రిజర్వాయర్కు నీటిని నింపడంలో నిర్లక్ష్యం వహించారు ఒక పర్యాయం మాత్రం టిడిపి పాలనలో నీటిని నిల్వ ఉంచారు. తుంగభద్రా నదికి భారీ వరదలు వచ్చి వందలాది టిఎంసిలు నీళ్లు శ్రీశైలం కు తరలిపోతున్న ఈ రిజర్వాయర్కు ఒక్క టీఎంసీ నీటిని మళ్లించలేకపోవడం మన దురదృష్టం. ఈ రిజర్వాయర్ కింద ప్రత్యక్షంగాను పరోక్షంగాను (అంటే కాల్వ ద్వారా సాగునీరు పొందడం, బోర్ల ద్వారా తాగునీరు పొందడం పొలాల్లో బోర్లు వేసుకుంటే అక్కడ భూగర్భ జలాలు పెరగడం) గ్రామాలు మార్కాపురం పెద్ద కొట్టాల చిన్న కొట్టాల బస్సుపాడు లక్ష్మీపురం పందిపాడు సల్కాపురం నాగలాపురం బూడిదపాడు బొల్లవరం కుసులూరు గ్రామాలు నీటి అవసరాలు పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. వందలాది ఎకరాలు పైరు పంటలతో సస్యశ్యామలం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. వేలాది జనాభాకు పశుపక్షాదులకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు అవకాశం ఉంది. తక్షణమే చిన్న రాయుడు తిప్ప రిజర్వాయర్కు నీరు మళ్లించి పొలాల్లో సాగునీటి కాలువలు నిర్మించి సాగునీరు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలిపారుఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి,నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు కే పార్వతమ్మ,మహిళ నాయకురాలు రమణమ్మ,మాజీ ఎంపీపీ వాకటి మాధవి,మాదేష్,తెలుగు యువత రాష్ట కార్యదర్శి ప్రభాకర్ యాదవ్,నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రహ్మణ పల్లె నాగిరెడ్డి, పెద్ధకొట్టల రంగా రెడ్డి,బిసి సెల్ రాష్ట సెక్రటరీ కాసాని మహేష్ గౌడ్,కల్లూరు మండల నాయకులు పెద్దపాడు రెడ్డి గారి లోకేశ్వర్ రెడ్డి ఇవి రమణ, ఇద్దo శ్రీకాంత్,దనుంజయ,బిచుపల్లి,సల్కపురం మౌలాలి,మరియు తదితరులు పాల్గొన్నారు.