NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫిలిం చాంబ‌ర్ ప్రెసిడెంట్ నారాయ‌ణ దాస్ నారంగ్ ఇక‌లేరు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ దాస్ కె నారంగ్ క‌న్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్ని సంబందిత వ్యాధితో బాధపడుతున్న నారంగ్, స్టార్ హాస్పిటల్ లో చికిత్స చేస్తుండగానే రెండు సార్లు హార్ట్ స్ట్రోక్ రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. ఆయ‌న కుమారులు సునీల్ నారంగ్‌, భ‌ర‌త్ నారంగ్ కూడా నిర్మాత‌లే. ఏషియన్ మల్టీ ప్లెక్స్, ఏషియన్ థియేటర్స్ అధినేత గా వున్న నారంగ్ శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో ‘లవ్ స్టొరీ, లక్ష్య’ సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం నాగార్జున సినిమా ‘ది ఘోస్ట్’, ధనుష్ తో ‘సార్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు.

                                                     

About Author